Site icon NTV Telugu

CM Revanth Reddy: “ఓపికగా ఉండండి లేదంటే..” పార్టీ నేతలకు రేవంత్ వార్నింగ్..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి హెచ్చరించారు. అనంతరం సీఎం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పలువురు నాయకులను ఉద్దేశించి హెచ్చరించినట్లు తెలుస్తోంది. తనని నమ్ముకున్న వాళ్లని తాను ఎప్పుడూ మర్చిపోనని సీఎం రేవంత్ అన్నారు. తనని నమ్ముకున్న వాళ్లలతో అద్దంకి దయాకర్ ఉన్నారని.. దయాకర్‌కు ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. ఓపికతో ఉంటే నాకూ బాధ్యత ఉంటుంది.. కాదు అని నా వెంట ఉండి.. బయటకు వెళ్లి ఎవరైనా విమర్శలు చేస్తే.. తనపై భారం ఉండదన్నారు రేవంత్.. చెల్లుకు చెల్లు అయినట్లు ఫీలవుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని..

READ MORE: Asaduddin Owaisi: మాపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. పాక్కి ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్

ఎమ్మెల్యేలు వెళ్తేనే.. ప్రజల్లోకి పథకాలు వెళ్తాయని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని… ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారని హెచ్చరించారు. అలాగే.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై సీఎం.. జానారెడ్డితో భేటీ అయ్యారు. మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కే కేశవరావు పార్టీలో చర్చిస్తారని తెలిపారు.

READ MORE: Maheshwar Reddy: రేవంత్‌రెడ్డికి కేసీఆర్ వెన్నంటి ఉన్నారు.. బీజేఎల్పీ నేత సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version