Site icon NTV Telugu

Revanth Reddy: యూరియా సరఫరా వేగవంతం చేయండి.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్‌!

Jp Nadda Revanth Reddy

Jp Nadda Revanth Reddy

ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్‌లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంకు కేటాయించిన ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికి రావాల్సిన యూరియా అందని విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. వానాకాలం సాగు దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా వేగవంతం చేయాలని కోరారు.

Also Read: Bandi Sanjay: విద్యార్థులకు శుభవార్త.. 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్న బండి సంజయ్‌!

ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులే యూరియా సరఫరా అయింది. 5 లక్షల టన్నుల అవసరానికి తక్కువగా పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జులైలో అందాల్సిన యూరియా 160 వేల టన్నులు కాగా.. ఇప్పటివరకు కేవలం 29 వేల టన్నులే రాష్ట్రానికి పంపిణీ అయింది. దేశీయంగా ఉత్పత్తైన యూరియా కోటా పెంచాలంటూ సీఎం డిమాండ్ చేశారు. రైల్వే శాఖ తగిన రేక్స్ కేటాయించటం లేదని సీఎం ఆరోపించారు. యూరియా సరఫరా లోటు పాట్లు తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version