NTV Telugu Site icon

CM Revanth Reddy: ఫాక్స్‌కాన్ కంపెనీ పనులను పర్యవేక్షించిన సీఎం రేవంత్..

Ts News

Ts News

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో నూతనంగా ఏర్పాటు అవుతున్న ఫాక్స్ కాన్ కంపెనీ పనులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కేఎల్ఆర్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రి కొంగరకలాన్ ఫాక్స్ కాన్ కంపెనీని సందర్శించారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు.

READ MORE: Pakistan Cricket: మేనేజ్‌మెంట్‌ తప్పు చేసింది.. ఫాన్స్ ఏం చేస్తారో చూడాలి!

కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ కంపెనీని సీఎం కోరారు.

READ MORE: AP CM Chandrababu: రతన్ టాటాకు నివాళిగా ఆయన పేరుతో హబ్.. సీఎం ట్వీట్

Show comments