Revanth Reddy : డబుల్ ఇంజన్ అంటే అదానీ.. ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారన్నారు. 150రోజులు 4వేలకు పైగా కిలోమీటర్లు రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని, భారత్ జోడో యాత్ర స్పూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్. కర్ణాటక తరువాత జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది…. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ తరువాత జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించిందన్నారు. ఈ సారి మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయ యాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నారన్నారు. ఈసారి దేశంలో ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయం.. దీన్ని మోదీ కూడా ఆపలేరని, ప్రతీ మెడిసిన్ కు ఒక expiry తేదీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
నరేంద్రమోదీ అనే మెడిసిన్ కు కూడా expiry తేదీ అయిపోయిందని, రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ పదే పదే చెబుతుందని, డబుల్ ఇంజన్ అంటే అదానీ.. ప్రధాని అని ఆయన వ్యాఖ్యానించారు. లోక్ సభలో రాహుల్ గొంతు విప్పడంతో ఆదానీ ఇంజన్ ఆగిపోయింది.. షెడ్ కు పోయిందని, ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర తో ప్రధాని ఇంజన్ ఆగిపోవడం ఖాయం…. షెడ్డుకు పంపడం ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ శ్రేణులారా వందరోజులు దేశం కోసం పనిచేయండని, కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండన్నారు. దేశంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి… దేశాన్ని కాపాడుకుందామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!