Site icon NTV Telugu

CM Revanth Reddy: కేంద్ర మంత్రులు మోదీ భజనలో బిజీగా ఉన్నారు.. సీఎం రేవంత్ సంచలనం!

Revanth

Revanth

CM Revanth Reddy: తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇక ఈ ట్వీట్ లో భాగంగా.. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు.. యూరియా సరఫరా చేయకుండా.. నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన శ్రీమతి ప్రియాంక గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

REDMI 15 5G: కేవలం రూ.14,999లకే 7000mAh భారీ బ్యాటరీ, 50MP రియర్ కెమెరాలతో రెడ్మీ 15 లాంచ్!

అలాగే రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని, మేం లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణం అంటూ పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మోదీ భజనలో బిజీగా ఉన్నారని మంది పడ్డారు. మన రైతుల కోసం మోదీ సర్కారు పై వత్తిడి తెచ్చేందుకు మాతో కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పత్తా లేరని రాసుకొచ్చారు. అంతేకాకుండా గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు, ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు!? అంటూ ప్రశ్నించారు. మోదీ అంటే భయమా! భక్తా!? అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

T20 World Cup 2024: బౌండరీ రోప్ వెనక్కి జరిపారు.. సూర్య క్యాచ్‌పై రాయుడు సెన్సేషనల్ కామెంట్స్!

Exit mobile version