NTV Telugu Site icon

CM Revanth: కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు.. సీఎం ఫైర్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని మాట్లాడేటోడికి.. మెదడు తక్కువ ఉన్నట్టు ఉందని దుయ్యబట్టారు. అది ఎప్పుడు చేస్తారో తెలియదు.. కేంద్రపాలిత ప్రాంతం అనేదే ఉండదన్నారు. కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. సెకండ్ క్యాపిటల్ చేయండి అని కేటీఆర్ డిమాండ్ చేశాడు కదా అని ప్రశ్నించారు.

Sonali Bendre: షోయబ్ అక్తర్ ‘కిడ్నాప్’ వ్యాఖ్యలపై సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్

వరంగల్ని హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు. ఎయిర్ పోర్ట్.. ఆర్ఆర్ఆర్ ఏర్పాటు అందుకేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ కూడా వరంగల్ లో ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు. మరోవైపు.. ఉచిత బస్తో మెట్రో నష్టపోతుందని తెలిపారు. మరోవైపు.. l@T అమ్ముకుంటాం అన్న కామెంట్స్ పై రేవంత్ రియాక్షన్ ఇచ్చారు. అమ్ముకుంటే అమ్ముకోమని తెలిపారు. మరోవైపు.. కేసీఆర్ ఏం మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే గౌరవం.. ఇప్పుడు ఏం మాట్లాడినా పరువు తక్కువ అని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. మంత్రివర్గ విస్తరణ అధిష్టానం చూసుకుంటుందని..
ముదిరాజ్ కి మంత్రి పదవి ఇస్తామని తెలిపారు. టికెట్లు ఇచ్చిన వాళ్లకు మళ్ళీ పదవులు ఉండవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

High Tension in Tadipatri: తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం.. సీఐ తలకు గాయం !

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం అయినా సత్సంబంధాలు జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొ్న్నారు. నెగిటివ్ ఆలోచనలు లేవని.. తనకు తెలంగాణ ముఖ్యం అని అన్నారు. పదేళ్లు.. వందేళ్ల విజన్ అందించాలి అనేదే తన పాలసీ అన్నారు. మరోవైపు.. ఏపీలో షర్మిల గెలవాలని కోరారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రయివేటు యూనివర్సిటీల్లో తప్పులు ఎవరు చేసినా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.