CM Revanth Reddy: పదేళ్లు ఎన్నో అద్భుతాలు సృష్టించే ఓపిక నాకు ఉంది..
- డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భారతరత్నఅంబేద్కర్ విగ్రహావిష్కరణ
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్‌మెంటేషన్,
- ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్‌మెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది అని అన్నారు. ఈ రోజు రాజ్యంగ పరిరక్షణ కోసం చర్చ జరగడం దురదృష్టకరం అని తెలిపారు. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. తాను సీఎం కాగానే కేబినెట్ ఎంపికకు ఎంత ప్రాధాన్యత ఇచ్చానో… వీసీల నియామకానికి అంతే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. ఉన్నత విద్యా ప్రమాణాలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాల సమూహం మాదిరిగానే వీసీలకు కూడా అందరికీ అవకాశం ఇచ్చామన్నారు. వీసీల నియామకంతో మా పని అయిపోయింది అని అనుకోవటం లేదని సీఎం అన్నారు.
NBK : అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను – బాలయ్య
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
కొత్తగా వచ్చిన బీసీలకు యూనివర్సిటీల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పాను.. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం మా ప్రభుత్వానికి అవకాశం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు ఎన్నో అద్భుతాలు సృష్టించే ఓపిక తనకు ఉందని తెలిపారు. యూనివర్సిటీలను ప్రైవేటుపరం చేయాలని ఎవరైనా ఆలోచన చేసిన అది జరిగే పని కాదు.. ఎంతోమంది విద్యావేత్తలను ఉత్తమ పార్లమెంటేరియన్లను ఈ దేశానికి యూనివర్సిటీలు అందించాయని సీఎం పేర్కొన్నారు. అలాంటి యూనివర్సిటీలు నిర్వీర్యం అవుతుంటే చూస్తూ ఊరుకోలేమని తెలిపారు. యుజీసీ నిబంధనల పేరుతో యూనివర్సిటీలపై పెత్తనం పొందాలని కొందరు చూస్తున్నారు.. యూజీసీ నిబంధనలు కుట్రతో మార్చాలనుకుంటున్నారు.. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారు
తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు భవిష్యత్తులో వీసీలను ఢిల్లీలో ఉన్న వాళ్ళు నిర్ణయిస్తామని చెప్తున్నారన్నారు.
Kadiyam Srihari: కేంద్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే..!
ఢిల్లీలో ఉన్న వాళ్లకు తెలంగాణకి ఏం కావాలో ఎలా తెలుస్తుంది.. ఈ ఆలోచన వెనుక పెద్ద సాంస్కృతిక దాడి కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు. అదే జరిగితే కొంతమంది చేసే విష ప్రచారాలకు యూనివర్సిటీలు వేదిక కాబోతున్నాయి.. జనవరి 26 సందర్భంగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా.. యూజీసీని అడ్డం పెట్టుకొని చేసే కుట్రలు రాజ్యాంగంపై దాడిగా చూస్తామన్నారు. మా ప్రజల మీద, మా ప్రాంతాల మీద మీరు దండయాత్ర చేయాలని చూస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కేంద్రం తీసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే సంస్థల మాదిరిగా మారిపోతాయని తెలిపారు మెజారిటీ ఉందని ప్రజాస్వామ్యం మూలాల మీద దాడి చేయాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి తెలంగాణకు ఇంకో అన్యాయం చేశారు.. పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం తెలంగాణకు ప్రతీక అయిన వారి పేర్లను ప్రతిపాదించాం.. మా ఏ ఒక్క ప్రతిపాదనను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని సీఎం పేర్కొన్నారు. మిత్రుడు మందకృష్ణ మాదిగకు ఇచ్చినందుకు తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఓపెన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్, ప్రొఫెసర్ల రిటైర్మెంట్, వయోపరిమితి 65 ఏళ్లకు పెంచాలని ఆలోచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!