NTV Telugu Site icon

CM Revanth: ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం బయట పెడతా..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy Counter To Ex Minister KTR: ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్ ఈ-ఫార్ములా కేసుపై సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బీఏసీ మీటింగ్‌లో 9 అంశాలు ఇచ్చారు.. దీంట్లో ఈ ఫార్ములా గురించి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఫార్ములా ప్రతినిధి తనను కలిశారని.. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ ఫార్ములా ప్రతినిధిని తన ఇంట్లో కలిశానని అన్నారు. తనకేం సంబంధం అని అడిగానన్నారు. కేటీఆర్‌తో అంత సెటిల్ చేసుకున్నానని ఫార్ములా ప్రతినిధి అన్నారు.. అధికారులతో మాట్లాడి చెప్తా అన్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ-కార్ రేస్ ప్రతినిధి తనను కలవడంతోనే ఈ బండారం బయటపడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Saregamapa : సరిగమప పార్టీకి వేళాయెరా’.. ఈ శనివారం మన ఖమ్మంలో!

ఏసీబీ విచారణలో ఉన్నందునా ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పలేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడ తానేం చెప్పినా కోర్టుకు వెళ్లి… సీఎం తన మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు చెప్పుకుందాం అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని పేర్కొన్నారు. వెంటనే విచారణ జరపాలని.. అధికారులకు సూచించానన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు సభ జరిగింది.. కానీ దీని గురించి చర్చకి అడగలేదని అన్నారు. ట్విట్టర్ పిట్ట ఇన్నాళ్లు ఎక్కడ పోయాడు.. బీఆర్ఎస్ వాళ్లకు మెదడు కూడా పోయినట్టు ఉందని సీఎం దుయ్యబట్టారు. ఎక్కడికైనా వస్తా.. చర్చ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవసరం అనుకుంటే వాళ్ల పార్టీ ఆఫీస్ కి ఐనా వెళ్తానని తెలిపారు. హెచ్ఎండీఏ ఖాతాలోని డబ్బులు లండన్ కంపెనీకి ఎలా వెళ్ళాయని సీఎం అడిగారు. ఈ- కార్ రేస్ అగ్రిమెంట్ రూ.55 కోట్లు కాదు.. రూ.600 కోట్లు అని ముఖ్యమంత్రి తెలిపారు. రూ. 600 కోట్లు లూటీ చేయాలని ఫార్ములా ఈ-రేస్ తెచ్చారని సీఎం పేర్కొన్నారు. నగదు బదిలీ చేయాలంటే ఆర్బీఐ అనుమతి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Delhi: ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమానిత బ్యాగ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

ఓఆర్ఆర్ టెండర్లు రద్దు చేయండని అంటున్నారు.. విచారణ జరగకుండా రద్దు చేస్తారా..? అని సీఎం ప్రశ్నించారు. విచారణ అడిగింది వాళ్ళే.. డిమాండ్ చేసింది వాళ్ళేనని సీఎం తెలిపారు. చర్చకు నేను వెనక్కి పోయే వాడినా అధ్యక్షా.. దేని మీద నైనా చర్చకు సిద్ధంగా ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారు. హరీష్ రావు అడిగితేనే ఓఆర్ఆర్ పై సిట్ వేశామన్నారు. ఈ విషయంపై కేసీఆర్ ఇంట్లో గొడవ జరిగిందని తెలిపారు. ఇంటికి వెళ్లాక హరీష్ కు కొరడా దెబ్బలు ఉంటాయన్నారు. హరీష్ బాధను తాను అర్ధం చేసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భారతి అంటే ఇందిరమ్మ.. పేదలకు భూమి ఇచ్చింది ఇందిరమ్మ అని సీఎం అన్నారు. పేదలకు భూముల హక్కులు ఇస్తాం.. బీఆర్ఎస్ వాళ్ళు రిటర్న్ గా సూచన పంపినా… విలువైన సూచన చేస్తే తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.