Saregamapa : సరిగమప పార్టీకి వేళాయెరా’.. ఈ శనివారం మన ఖమ్మంలో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటికప్పుడు ఆకట్టుకునే సీరియల్స్, ఆసక్తికరమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. సందర్భానికనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. జీ తెలుగు సరిగమప గాయనీగాయకులు, నటీనటులు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నారు ఖమ్మం వచ్చేస్తున్నారు.
ప్రతి పండుగకి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వినోదాన్ని రెట్టింపు చేసే జీ తెలుగు నూతన సంవత్సర వేడుకను జరిపేందుకు సిద్ధమైంది. ఖమ్మంలోని SR & BGNR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వేదికగా జీ తెలుగు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమం జరగనుంది. ఎనర్జిటిక్ యాంకర్స్ రవి, లాస్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. జీ తెలుగు పాపులర్ సింగింగ్ షో సరిగమపనెక్స్ట్ సింగింగ్ యూత్ఐకాన్గాయనీ గాయకులతో పాటు మెంటర్ అనుదీప్, మీ అభిమాన జీ తెలుగు సీరియల్స్ నటీనటులైన మేఘసందేశం అభినవ్(గగన్), గౌరి(భూమి), నిండు నూరేళ్ల సావాసం అమరేంద్ర(రిచర్డ్ జోస్), అరుంధతి(పల్లవి గౌడ), భాగమతి(నిసర్గ గౌడ), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మిత్ర(రఘు), లక్ష్మీ(మహీ గౌతమి)తో పాటు లిఖితా మూర్తి, శోభా శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అలరించనున్నారు. హృదయాన్ని హత్తుకునే పాటలు, అలరించే ఆటలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే 2025 సంవత్సరానికి జీ తెలుగు ఆహ్వానం పలుకుతోంది.
Also Read
అభిమానుల సందడితో కోలాహలంగా సాగనున్న ఈ కార్యక్రమంలో గాయనీగాయకులు, నటీనటులు వేరు వేరు జట్లుగా పోటీపడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాటల పోటీలు, కామెడీ స్కిట్లు, ఫన్నీ అవార్డ్స్, అందాల పోటీలు, అద్భుతమైన ప్రదర్శనలు వంటి వాటితో వినోదం అందించడంతోపాటు ప్రతిభావంతులైన వికలాంగులను ప్రోత్సహించనుంది జీ తెలుగు. బుల్లితెరపై తమప్రతిభతో అలరిస్తున్న జీ తెలుగు తారలు, గాయనీగాయకులు తమ అభిమానులతో కలిసి నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికేందుకు వచ్చేస్తున్నారు. మీరు కూడాఈ శనివారం సాయంత్రం 5 గంటలకు, మన ఖమ్మంలో.. తప్పక పాల్గొనండి!
తాజావార్తలు
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
-
Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!