Site icon NTV Telugu

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్ పోర్టు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఎయిర్ పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తిచేసి వీలైనంత త్వరగా డిజైనింగ్ కు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్ పోర్టు ఉండాలని సీఎం సూచించారు.

READ MORE: Champions Trophy 2025: ఇంగ్లండ్‌ ను మట్టికరిపించిన సౌతాఫ్రికా.. సెమీస్‌లోకి ఎంట్రీ

ఎయిర్ పోర్టు వద్ద నిత్యం యాక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. విమాన రాకపోకలతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా ఉండేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతీ నెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ధన్యవాదాలు తెలిపారు.

READ MORE: Bandi Sanjay: రంజాన్ కోసం పదో తరగతి పరీక్ష టైం టేబుల్ మారుస్తారా?

Exit mobile version