NTV Telugu Site icon

CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై అధిష్టానందే నిర్ణయం..

Cm Revanth

Cm Revanth

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై మరోసారికి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అధిష్టానం ఇంకా ఏమీ ఖరారు చేయలేదు. ఈరోజు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అవుతుందనే దానికి మళ్లీ బ్రేక్ పడింది. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ఈ విషయాలపై చర్చించారు. అయినప్పటికీ ఈ అంశం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డిమాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకం పై ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బాల్ ఏఐసీసీ కోర్టులో ఉంది.. ఎందుకు ఆలస్యం అవుతుందనేది ఏఐసీసీ అధిష్టానం చెప్పాలన్నారు.

Read Also: Rahul Gandhi: కూలీలను కలిసిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర చర్చ

కేబినెట్ విస్తరణ, నూతన పీసీసీ నియామకం జరగాలని ఏఐసీసీ అధ్యక్షున్ని కోరాం.. ఏఐసీసీ హైకమాండ్ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్, బీజేపీపై సీఎం విమర్శలు గుప్పించారు. సింగిల్ సీటు పార్లమెంట్ లో లేదు.. బీఆర్ఎస్ ను టార్చ్ లైట్ వేసుకొని కేసీఆర్ వెతుక్కోవాలని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ప్రజలు విసిగి చెంది ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అమిత్ షాకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పై చర్చించుకుంటున్నామని చెప్పాం.. కేంద్రం సహకరించాలని చెప్పామన్నారు. రాముడి గుడితో పాటూ.. దేవుడి మాన్యాలు.. ఇలా ఎన్నో అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పరిష్కారం జరిగేటివి జరుగుతాయి.. లేదంటే కేంద్రం ఎలాగు ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Team India-PM Modi:ప్రధాని మోడీతో ఇండియా క్రికెటర్లు స్పెషల్ మీట్.. ఫొటోలు వైరల్