CM Revanth Reddy: గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి రహదారులపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్నీ శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ నియామకమయ్యారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ,హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Minister Uttam Kumar Reddy: పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తాం..
కోకోకోలా గ్రీన్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
రేపు వెయ్యి కోట్ల కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్‌అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్‌ను సోమవారం మధ్నాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించనున్నారు. దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి