తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డి కి దక్కుతుందని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆంగ్ల భాషను వ్యతిరేకించిన కేటీఆర్ పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Naa Saami Ranga Collections : ఎనిమిదో రోజు నాగార్జున మూవీ కలెక్షన్స్.. రికార్డు బ్రేక్ చేసేసిందా?
అయితే, మన భాష మన భావం ముఖ్యం తప్ప ఏదో ఇంగ్లీష్ వచ్చింది కదా అని నాలుగు ముక్కలు మాట్లాడి అడ్డగోలుగా ట్రోల్ చేయడం సరైనది కాదని కాంగ్రెస్ నేతలు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్వేచ్చాయుత జీవితం గడుపుతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మూసి రివర్ ను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాదిరిగా తెలంగాణలో అభివృద్ధి చేయాలని ఆలోచనలలో ఉన్నట్లు తెలిపారు.