నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. మరికొద్ది సేపట్లో సీఎం మీడియాతో మాట్లాడనున్నారు.
READ MORE: Meenakshi Chaudhary : ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు!
కాగా.. నీటి ఊట.. టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్‌కి తీవ్ర ఆటంకంగా మారింది. నీరు నిరంతరాయంగా వస్తోంది. నీరు ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ సర్వే టీమ్ అన్వేషిస్తోంది. టన్నెల్ పైభాగంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని తిర్మలాపూర్ సమీప ప్రాంతం లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్లు అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ టీమ్ సర్వే నిర్వహించాయి. మల్లెల తీర్థం నుంచి కృష్ణా నది వైపు ప్రవాహం సాగుతోంది. ప్రస్తుతం ప్రమాద స్థలం పైభాగం 450 మీటర్ల లోతులో కుర్తి పెంట టేకుల సర్వ ప్రదేశంలో పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొరలు అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవీ క్షేత్ర పరిధిలోని తాటి గుండాల పరిసర ప్రాంతాలలోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణ నది వైపు పారుతున్నట్లు అంచనా వేశారు. పై వాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు.
READ MORE: Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు