Site icon NTV Telugu

CM Revanth Reddy: మోడీ దేశానికి బడే భాయ్.. రాష్ట్రాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి..

Cm Revanth

Cm Revanth

అర్బన్ డెవలప్మెంట్ పై దక్షిణ–పశ్చిమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్ లాల్ దేశాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని మా ప్లాన్ అని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశామన్నారు.

Also Read:Prashant Kishor: నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన

మోడీ 2047కి 30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకున్నారు.. మేము దేశంలో 10 శాతం ఉండాలని ప్లానింగ్ చేసుకున్నామని తెలిపారు. మెట్రో విస్తరణ… మూసి ప్రక్షాళన. ఆర్ఆర్ఆర్.. రేడియల్ రోడ్లకు నిధులు..అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. 3000 ఎలెక్ట్రిక్ బస్సులు నడపాలని ప్లానింగ్ చేస్తున్నామని తెలిపారు. డేటా.. ఐటీ.. మెడికల్ ..ఫార్మాలకు హబ్ హైదరాబాద్.. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ కట్టాలని అనుకుంటున్నామన్నారు. సింగపూర్.. దుబాయ్ లతో పోటీ పడాలని అనుకుంటున్నామని తెలిపారు.

Also Read:Maoist Key Leader Hidma Encounter: ఎన్‌కౌంటర్‌లో భార్యతో సహా మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి.. ఎవరి హిడ్మా..?

అందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రుల ఇబ్బందులు ఏంటన్నది మోడీ కి కూడా తెలుసన్నారు. మోడీ దేశానికి బడే భాయ్.. బడే భాయ్ గా రాష్ట్రాల అభివృద్ధి కి మద్దతు ఇవ్వండని కోరారు. రాజకీయాలు వేరు.. పాలసీలు వేరని అన్నారు. గత ప్రభుత్వంకి..మాకు రాజకీయాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ అభివృద్ధి విషయంలో లేవు.. కేంద్రంతో ఐనా అంతే అని తెలిపారు. కేంద్రం మద్దతు కావాలన్నారు. నిధులే కాదు.. మీ అనుభవాలు కూడా మాతో పంచుకోండని కోరారు. హైదరాబాద్ మీద మోడీ.. ఖట్టర్ లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ కోరారు.

Exit mobile version