బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
Read Also: Maharashtra: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. సకోలీ నుంచి నానా పటోలే పోటీ
ఈ సందర్భంగా.. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం మీ పై కక్ష సాధింపు చర్యలకు దిగదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు తెలిపారు. కలిసి పని చేయాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు.. అన్నిటిని చక్కదిద్దుతూ అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆదాయ వనరుల మీద మీరు కూడా ఫోకస్ చేయండని వారికి సూచించారు. ఈ క్రమంలో.. తమ సమస్యలు అన్నీ పరిష్కారం చేయండి.. 2 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి మీకు సన్మానం చేస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ సీఎంకు తెలిపారు.
Read Also: US-China trade war: అమెరికా-చైనా శత్రుత్వాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేదా?
మరోవైపు.. రేపు సీఎస్‌తో ఉద్యోగ సంఘాలు వేరు వేరుగా సమావేశం కానున్నారు. పాలనాపరంగా పరిష్కారం చేసుకునే అంశాలపై చర్చ జరుగనుంది. 26వ తేదీ జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశం ఉంది.