CM Revanth Reddy: రైతుల కోసం ఉపాధి హామీలో 10 కొత్త పనులు.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమ అంశాలపై చర్చించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) 2.0 పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, దీనివల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకమైన వీబీ-జీ రామ్-జీ జాబితాలో మరికొన్ని అదనపు పనులను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతుల జీవనోపాధిని దెబ్బతినకుండా కాపాడేందుకు 10 కొత్త రకాల పనులను ఉపాధి హామీ కింద నిర్వహించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కూరగాయల పందిళ్ల నిర్మాణం, పశుగ్రాస ప్లాట్ల పెంపకం, మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల షెడ్ల ఏర్పాటు వంటి వ్యవసాయ అనుబంధ పనులకు ఆమోదం తెలపాలని ప్రతిపాదించారు.
Also Read
దీంతో పాటు రైతుల సొంత భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ చర్యలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న సాగుభూముల పునరుద్ధరణ పనులకు ఉపాధి హామీ పథకంలో అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కూడా ఈ పథకం జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగమయ్యే లబ్ధిదారులకు కనీసం 90 రోజుల పాటు పని కల్పించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సమగ్రంగా వివరించారు.
తాజావార్తలు
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
-
Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!