NTV Telugu Site icon

CM Revanth Reddy : స్పీడ్‌ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Cm Revanth Reddy

Cm Revanth Reddy

స్పీడ్ ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండని, ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయండన్నారు సీఎం రేవంత్‌. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండని, వీటితోపాటు హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండని, మనకున్న వనరుల అభివృద్ధికి అవసరమైనచోట పీపీపీ విధానాన్ని అవలంభించండన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అవకాశం ఉన్నచోట హెలీ టూరిజం అభివృద్ధికీ ప్రణాళికలు రూపొందించండన్నారు. అంతేకాకుండా.. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

 Tamil nadu: నిట్ కాలేజీలో దారుణం.. ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. అరెస్ట్

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. భక్తులకు సౌకర్యాలు , భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలని సీఎం రేవంత్‌ అన్నారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీళ్లేదని, ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

 Puja Khedkar: హైకోర్టులో పూజా ఖేద్కర్ మరో పిటిషన్.. ఏం అభ్యర్థించిందంటే..!