రేపు మహా శివరాత్రి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు.

శివలింగానికి పూజలు, అభిషేకాలు చేస్తారు. కానీ.. శివలింగాలు ఎన్ని రకాలో మీకు తెలుసా?

శివలింగాలు 5 రకాలుగా ఉంటాయి. ఒక్కో శివలింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.

1. స్వయంభువు లింగం: దేవతలు, ఋషులు ప్రార్థనలకు శివుడు అనుగ్రహించి వెలిస్తే స్వయంభువు లింగమంటారు.

2. బిందు లింగం: యంత్రంలో చెక్కబడిన లింగాన్ని బిందులింగమని చెబుతారు.

3. ప్రతిష్ఠ లింగం (పౌరుషము) లింగం: ఇది దేవత, గురువు, మానవు ఆధ్వర్యంలో శిల్పి ద్వారా చేయించి మంత్ర పూర్వకంగా లింగం.  

4. చర లింగం: ఇది పాదరసం, ఏదైనా లోహంతో చేసిన, మెడలో కట్టుకునే లింగం. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.  

5. గురు లింగం: నడుస్తున్న గురువే లింగం. ఈశ్వరుడే గురువు రూపంలో ఉంటాడు.