NTV Telugu Site icon

CM Revanth Reddy: ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి మహాశివరాత్రి, ఉమెన్స్‌ డే శుభాకాంక్షలు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: మ‌హాశివ‌రాత్రి ప‌ర్వదినాన్ని పుర‌స్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్​ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠుణ్ణి సీఎం ప్రార్ధించారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తున్న భక్తులందరికీ ఆ మహాదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.

Read Also: Mahashivratri 2024: శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని అన్నారు.

అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని సీఎం ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడుతామన్నారు. మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందని అన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.

Show comments