మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠుణ్ణి సీఎం ప్రార్ధించారు.
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
Maha Shivratri : మహాశివరాత్రి పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. దీంతో శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. పూజ సమయంలో శివుడికి పలు పదార్థాలను నైవేద్యంగా అందిస్తారు.
మహామృత్యుంజయ్ మంత్రాన్ని పఠించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది. మహాశివరాత్రి నాడు, మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుడిని కూడా పూజించవచ్చు. మహామృత్యుంజయ మంత్రం మూల కథ శివునితో ముడిపడి ఉంది. రండి, మహామృత్యుంజయ మంత్రం కథ, దానిని జపించవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం.