తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం.. బీఆర్ఎస్సేనని మండిపడ్డారు. తెలంగాణ అప్పు 7 లక్షల 22 వేల కోట్లు.. వాళ్ళు తెచ్చిన అప్పుకు 11.5 వడ్డీ అని అన్నారు. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటాం.. వేరే దేశాల్లో ఐతే ఉరి తీసేవాళ్ళని ఆరోపించారు. ఢిల్లీకి నేను వెళ్తుంది.. ఆర్థిక శాఖ న్యాయ నిపుణుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు.. హాస్టల్‌లకు మీరేం చేశారని బీఆర్ఎస్ ను సీఎం ప్రశ్నించారు. హాస్టల్ కట్టలేదు.. అమ్మాయిలకు టాయ్లెట్ కట్టలేదన్నారు. నాలుగు గంటల నుండి క్యూ కట్టాల్సిన పరిస్థితి.. పదేళ్లు బాత్‌రూం కూడా కట్టనందుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ఆయన సభకు రావడం లేదు.. వస్తే కడిగేద్దాం అని ఏడాది నుండి చూస్తున్నానని అన్నారు.
Read Also: AP Rains: లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. ఏపీలో 3 రోజులు వర్షాలే వర్షాలు..!
మీరెంత.. మీ స్థాయి ఎంత.. నా నిబద్ధతను మీరా ప్రశ్నించేదని తీవ్ర స్థాయిలో సీఎం మండిపడ్డారు. పేపర్ దిద్దలేని మీరు.. టీఎస్పీఎస్సీ పరీక్ష పెట్టలేని మీరు.. నన్నా అడిగేదని దుయ్యబట్టారు. కేసీఆర్ దొంగ లెక్కలు చూపించలేదు.. ఈటల కూడా దొంగ లెక్కలు చూపలేదు.. కానీ కేసీఆర్ తరవాత వచ్చిన హరీష్ దొంగ లెక్కలు రాశాడని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పెద్దమనిషి పని ఎట్లా ఉందంటే.. ప్రశ్నపత్రం నువ్వే రెడీ చేసి.. నువ్వే సమాధానం చెప్పి.. నువ్వే ఎక్కువ మార్కులు వేసుకుని ఇదే నా ఘనత అంటున్నాడని విమర్శించారు. అప్పులు ఎక్కడ ఉన్నాయో.. తప్పులు ఎక్కడ ఉన్నాయో చూడనివ్వండని అన్నారు. తమ చేతులు విరగొట్టాలి అని చూస్తున్నారని బీఆర్ఎస్ పై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: CM Revanth Reddy On Rythu Bharosa: రైతు భరోసాపై సందేహాలు అవసరం లేదు
కొడంగల్ ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రజలు ఇచ్చిన దీవనతో సీఎం అయ్యానని తెలిపారు. కోట్ల రూపాయలతో లావాదేవీ పెట్టుకుని ఫార్మా పెట్టొచ్చు.. ఏమీ లేని తన ప్రాంతానికి మెడికల్ కాలేజీ పెడితే తప్పా అని అన్నారు. కాలేజీలు తీసుకున్నా తప్పే అంటారు.. కొడంగల్ 3 లక్షల ఎకరాల్లో 1300 ఎకరాలు తీసుకుని పరిశ్రమలు పెడదాం అనుకున్నానని అన్నారు. కొడంగల్ ప్రజలకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ కోట్లు ఖర్చు చేసి అధికారుల మీద దాడి చేయించారని మండిపడ్డారు. కొడంగల్ లో పరిశ్రమలు పెట్టొద్దా.. ఉద్యోగాలు ఇవ్వొద్దా.. మా పిల్లలు డాక్టర్లు కావద్దా అని అన్నారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతా అని అందుకే చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.