NTV Telugu Site icon

CM Revanth Reddy: వరద ముంపు ప్రాంతాలలో పర్యటించాలి.. ప్రధానికి సీఎం రేవంత్ లేఖ

Cm Revanth Reddy Pm Modi

Cm Revanth Reddy Pm Modi

CM Revanth Reddy: భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదే విధంగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్తు సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలని చెప్పారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని సీఎం హెచ్చరించారు. రెవిన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలు ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Read Also: Telangana Rains : తెలంగాణకు తప్పిన భారీ వాన గండం.. కానీ

మరోవైపు తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటించాలని కోరుతూ ప్రధాని మోడీకి రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి తక్షణ సాయం అందజేయాలని లేఖలో ప్రధానిని కోరారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా కమిషనర్లు చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన పేర్కొన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో బయలుదేరారు. కోదాడలో ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. సూర్యాపేట సమీపంలోని టీఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఖమ్మం వెళ్లనున్నారు. రాత్రి ఖమ్మంలో బస చేయనున్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.