CM Revanth Reddy: హైదరాబాద్ సిటీలో ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత మాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాతబస్తీ మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర ఐదు స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి వెళ్లవచ్చు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీలో ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదని అన్నారు. హైదరాబాద్ ను కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.
Delhi: రష్యా ఉద్యోగాలపై కేంద్రం కీలక ప్రకటన
Also Read
హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికే తాము మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొ్న్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే తమ దృష్టి అని అన్నారు. ఓల్డ్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా.. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే లండన్ థెమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్ తో కలిసి సందర్శించామని చెప్పారు..
Hyderabad: నగరం శిఖలో డబుల్ డెక్కర్ కారిడార్.. రేపు నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్-2 ను తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా.. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. చంచల్ గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తామని సీఎం తెలిపారు. మైనారిటీల కోసం 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.
తాజావార్తలు
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!