Site icon NTV Telugu

CM Revanth Reddy: పొట్టి శ్రీరాములు త్యాగం.. దేశభక్తిని గుర్తించాల్సిందే..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని గత శాసన సభలో నిర్ణయించామని తెలిపారు. సీపీఐ సభ్యులు కునంనేని సూచన చేశారని అన్నారు. రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు. పొట్టి శ్రీరాములు త్యాగం.. దేశభక్తిపి గుర్తించాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read:Orry: చిక్కుల్లో ఓర్రీ.. వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించడంపై ఎఫ్ఐఆర్

తెలంగాణ విభజన జరిగిన తర్వాత.. పాలన పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. తెలంగాణ కోసం కృషిచేసిన వాళ్ళను స్మరించుకోవడం జరుగుతుంది. కొందరు వీటిపై అపోహలు కల్పించేలా మాట్లాడుతున్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడాటం దురదృష్టకరమని అన్నారు. ఒక్క వ్యక్తి కోసమో.. కులం కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. ఏపీ లో యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగుతుంది. తెలంగాణ లో యూనివర్సిటీ కి సురవరం పేరు పెట్టుకున్నాం. నిజాంకి వ్యతిరేకంగా 354 మంది కవులను ఏకం చేశారు. సీఎంకి.. ఓ కులం మీద అభిమానం ఎక్కువ అని బయట అంటున్నారు.

Also Read:Pawan Kalyan: ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా.. అధికారులపై చర్యలు తప్పవు!

నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ఎందుకు పెడతానని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు కూడా పెట్టాం. కేంద్రంలో ఉన్న వాళ్ళు కించపరిచేలా చేస్తే ఎట్లా. వాళ్ళు గెలిచిన చోట ఆ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియంకి.. మోడీ పేరు పెట్టారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పటేల్ పేరు మార్చి పెట్టారు. అలాంటి తప్పులు చేయను. చర్లపల్లి టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి లేఖ రాస్తానని తెలిపారు. రోశయ్య విగ్రహం బల్కం పేట లో ఏర్పాటు చేస్తామని.. నేచర్ క్యూర్ ఆసుపత్రికి పేరు పెడతామని తెలిపారు.

Exit mobile version