NTV Telugu Site icon

CPI Narayana: తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు

Cpi Narayana

Cpi Narayana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయే పరిస్థతి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అందుకే అధికారుల్ని కేడర్ ని నమ్మించటానికి విశాఖలో హడావిడి అని చెప్తున్నారు.. నేను విశాఖలోని హోటల్స్ కు ఫోన్ చేశాను ఎక్కడ గదులు బుక్ కాలేదు.. కౌంటింగ్ సందర్భంగా రెచ్చగొట్టే మాటల్లో కూడా ఓడిపోతారని విషయం తెలుస్తోంది.. డీఐజీ ఇంటెలిజెన్స్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు మంచి అధికారి అని ఆయన పేర్కొన్నారు. కానీ, రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి ఆయనను డ్యూటీలోకి తీసుకోలేదన్నారు.

Read Also: Viral video: నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్.. వాహనదారులకు ఇక్కట్లు

ఈ ఐదు సంవత్సరాలు వెంకటేశ్వరరావు పైన సీఎం జగన్ కక్ష తీర్చుకున్నాడు అని సీపీఐ నారాయణ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాజిటివ్ ఆలోచనతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయ్యేది.. ఆయన మరోసారి సీఎం అయ్యేవాడు అని పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు.. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదన్నారు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తే రేవంత్ రెడ్డి ఆయన నెత్తిన ఆయనే చెత్త వేసుకున్నట్టు అవుతుంది.. తెలంగాణ గేయాన్ని కొత్తగా రూపొందించడానికి అభినందిస్తున్నామని నారాయణ వెల్లడించారు.

Read Also: Sathyaraj-SSMb29: రాజమౌళి-మహేశ్‌ ప్రాజెక్ట్‌లో అవకాశం.. క్లారిటీ ఇచ్చిన కట్టప్ప!

ఇక, తెలంగాణ చిహ్నం జోలికి పోకపోవడం మంచిది అని సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సూచించారు. తెలంగాణ గేయానికి సంగీత దర్శక కీరవాణిని పెట్టడాన్ని టిఆర్ఎస్ ప్రాంతీయవాదం ముందుకు తేవడం సబబు కాదు.. ఇక, కన్యా కుమారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధ్యానం చేయడం కన్యాకుమారిని కలుషితం చేయడమే అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోడీ రాకపోతే, తప్పకుండా చంద్రబాబు ఇండియా కుటమిలోకి రావాలని కోరుకుంటున్నాను అని నారాయణ చెప్పుకొచ్చారు.