తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండుగ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని.. భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయన్నారు.. వ్యవసాయం దండుగా అనే రోజుల నుంచి వ్యవసాయం పండుగ చేసే దిశగా ముందుకు సాగామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం మొట్ట మొదటి ప్రాధాన్యత రైతులు తర్వాత ఆడబిడ్డలు, తర్వాత ఉద్యమకారులు, విద్యార్థులు అన్నారు. నాడు కేసీఆర్ ఎగ్గొట్టిన రూ. 7500 కోట్ల రైతు బంధు అధికారంలోకి వచ్చిన వెంటనే వేశామన్నారు. రైతులను అప్పుల నుంచి విముక్తులను చేశామని చెప్పారు. వరి వేసుకుంటే ఉరే అని నాటి ముఖ్యమంత్రి చెప్పారని.. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పండించండి.. అదనంగా 500 బోనస్ ఇస్తాం అని చెబితే రైతులు సన్న వడ్లు పండించారన్నారు. నాడు తాలు పేరుతో క్వింటాల్ కు 10 కిలోలు తరుగు తీసే వారని.. ఇప్పుడు ఒక్క కిలో తరుగు తీసినా తోలు తీస్తామని హెచ్చరించామన్నారు.
READ MORE: Bhatti Vikramarka: ఈ రోజు దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ దినం..
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ పేషంట్ ఎలా ఉంటారో రాష్ట్ర పరిస్థితి అలా ఉన్నప్పుడు తమకు ప్రభుత్వాన్ని అప్పగించారన్నారు. శకుని మామకు తగ్గట్లు శనీశ్వర అల్లుడు తోడైండని.. రైతు సెంటిమెంట్‌ను ఆదాయ వనరుగా మార్చుకున్నారన్నారు. రూ. వేల కోట్ల అధిపతులు కేసీఆర్, హరీష్, కేటీఆర్ అయ్యారని.. అది ఎలా సాధ్యం అయ్యిందని ప్రశ్నించారు. ఫామ్ హౌజ్ లు ఎలా వచ్చాయని బీఆర్ఎస్ నేతలను అడిగారు. నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని.. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోనే రూ. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
READ MORE: Thammudu: దిల్ రాజు ముందు పెను సవాల్!