NTV Telugu Site icon

CM Revanth Reddy : అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా.. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండండి

Revanthreddy

Revanthreddy

CM Revanth Reddy : తనకు కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే, మంత్రులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు. నేను మారిన… మీరు మారండని, ఇవాళ అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పని తీరు… ప్రోగ్రెస్ పై సర్వే రిపోర్ట్ లు నా దగ్గర ఉన్నాయన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా అని, అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండండని ఆయన సూచించారు. ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు… తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఏడాది పాలన అనుభవాలు…వచ్చే నాలుగేళ్లకు ఉపయోగపడతాయని, అంగన్ వాడి… డీలర్ల నియామకం లో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వండని సీఎంని ఓ మంత్రి కోరడంతో.. ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకుని… పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎం రేవంత్ చెప్పారు.

Pace Hospitals: మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం.. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

అంతేకాకుండా..’ఉపాధ్యాయుల నియామకం.. ప్రమోషన్ లు గత ప్రభుత్వం ఎందుకు వచ్చిన లొల్లి అని చేయలేదు.. కానీ మనం ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేశాం.. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా.. మీరు నన్ను ఏవిధంగా అనుకుంటారో… మిమ్మల్ని మీ కింది నాయకులు అలాగే అనుకుంటారు.. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా కీలకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి…. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే సమాచారం నా దగ్గర ఉంది’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Russia-Ukraine: ఐరోపాకు గ్యాస్ రవాణా నిలిపేసిన రష్యా, ఉక్రెయిన్.. 5 దశాబ్దాల సరఫరాకు బ్రేక్

Show comments