NTV Telugu Site icon

Good News: సింగరేణి కార్మికులకు సీఎం శుభవార్త.. దసరాకు రూ.లక్షా 90 వేల బోనస్

Singareni

Singareni

Good News For Singareni Employees సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సింగరేణిది కీలక పాత్ర అని.. లాభాల్లో వాటాను దసరా ముందు కార్మికులకు అందిస్తున్నామన్నారు. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్‌ ప్రకటించారు. దసరా ముందు లాభాల్లో వాటా పంచి కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నామన్నారు.

Read Also: IPhone 16 First Customer: తెల్లవారుజామున 4:30 నుంచే క్యూలో.. ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి

సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి తలమానికమని, సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణిని విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని కూడా తీసుకున్నామన్నారు. రూ.796 కోట్లు కార్మికులకు, ఉద్యోగులకు బోనస్‌ రూపంలో అందజేస్తామన్నారు. ఒక్కొక్క కార్మికుడికి రూ.లక్షా 90 వేలు అందజేస్తున్నామన్నారు. గతేడాది కంటే రూ.20 వేలు అధికమని డిప్యూటీ సీఎం తెలిపారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ఉన్నారని.. తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా బోనస్‌ ఇస్తున్నామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేలు బోనస్ అందిస్తామన్నారు. లాభాలు కార్మికులకు పంచుతున్నామన్నారు.