NTV Telugu Site icon

CM Revanth: పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. అధికారులతో రివ్యూ మీటింగ్లో సీఎం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించండని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించండని అధికారులకు సూచించారు.

NSA Ajit Doval: ఇజ్రాయెల్ ను ప్రశంసించిన అజిత్ దోవల్.. ఏమన్నారంటే?

కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలని.. జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయండని పేర్కొన్నారు. మరోవైపు.. నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దు అని సూచించారు. పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలని.. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోండని తెలిపారు. కోడ్ ముగిసిన తరువాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని.. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండని.. వాటికి బారీకేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టండని అధికారులను కోరారు.

General Class Coaches: జనరల్ కంపార్ట్మెంట్లు రైలులో ముందు, వెనుక మాత్రమే ఎందుకుంటాయంటే..

గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టండని అధికారులకు సూచించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయండని.. కంటోన్మెంట్ ఏరియాలో నాళాల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండని.. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించండని అన్నారు. సమస్యాత్మక నాళాల వద్ద అవసరమైతే ప్రతీ రోజు క్లీనింగ్ చేపట్టండని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని.. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోండని సూచించారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అన్నారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం తెలిపారు.

Show comments