NTV Telugu Site icon

CM Revanth Reddy : పెద్దన్నగా మేము భావించాం.. మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

కేంద్ర బడ్జెట్‌పై సీఎ రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తూన్నారన్నారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచిన పార్లమెంటు ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వం తో జరిగిన నష్టం నుండి క్పడటానికి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుద చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారం అయిపోయాక.. వివక్ష లేకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి అని ప్రధానిని అడిగామని, ఇప్పటి బడ్జెట్ లో సహకరించాలి అని అడిగామని ఆయన వెల్లడించారు. బేషజాలకు పోకుండా వెళ్లి అడిగామని, పెద్దన్నలగా వ్యవహారం చేయండి అని అడిగామన్నారు. కానీ వికసిత్ భారత్ బడ్జెట్ లో ఏం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదం నిషేధించారని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తప్పుపట్టిన మోడీ.. ఇప్పుడు బడ్జెట్ చూస్తే.. ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు.

అంతేకాకుండా..’వివక్ష అనుకున్నాం కానీ..కక్ష పూరితంగా వ్యవహరించింది. విభజన చట్టం పేరుతో.. ఏపీ కి రాజధానికి… వెనకబడిన జిల్లాల కోసం నిధులు ఇచ్చారు. ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణ కి ఎందుకు ఇవ్వలేదు. మెట్రోకి కానీ.. itir కారిడార్ ప్రస్తావన లేదు. వికసిత భారత్ లో తెలంగాణ లేదనుకున్నట్టి ఉంది మోడీ. కుర్చీ బచావో అన్నట్టు ఉంది. కుర్చీ కాపాడుకునే బడ్జెట్ ఇది. ఇది మోడీకి గౌరవం తెచ్చి పెట్టదు. 8 ఎంపీ సీట్లు ఇచ్చారు తెలంగాణా ప్రజలు. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్ల మోడీ ప్రధాని సీటులో కూర్చున్నారు.

8 ఎంపీ సీట్లు ఇచ్చిన బీజేపీ.. తెలంగాణ ప్రజలకు ఏం ఇవ్వలేదు. కిషన్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. కేబినెట్ నుండి తప్పుకోవాలి. మౌనంగా ఉండటం సరికాదు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఐఐఎం.. కోచ్ ఫ్యాక్టరీ లేదు. ఐఐఎం దేశం అంతటా ఉంది.. తెలంగాణ కి ఎందుకు ఇవ్వరు, ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి కొనసాగడం ఎందుకు. అమరావతి కి వేల కోట్ల ఇస్త అన్న మోడీ.. తెలంగాణ మెట్రోకి.. మూసీకి ఎందుకు ఇవ్వరు. పెద్దన్నగా మేము భావించాం.. మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.
కేవలం క్విట్ ప్రోకో అన్నట్టు ఉంది బడ్జెట్. మీరు మద్దతు ఇవ్వండి..మేము దేశాన్ని దోచి మీ రెండు రాష్ట్రాలకే ఇస్తాం అన్నట్టు ఉంది. మా నిరసన ఉంటుంది..సభలో’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.