KRMB కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లొంగిపోయిందన్నారు. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం నన్ను అడిగే రాశారని కేసీఆరే చెప్పారని, కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పజెప్పడానికి పునాది పడిందే 2014లో అని సీఎం రేవంత్ అన్నారు.
అంతేకాకుండా.. ‘కృష్ణ..గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్.. హరీష్ ..డ్రామారావు. వారి పాపాలు కప్పిపుచ్చి..కాంగ్రెస్ మీద నెట్టే పనిలో ఉన్నారు.రాజకీయంగా లబ్ధిపొందే కుట్ర చేస్తున్నారు. అబద్ధాల ప్రాతిపదికన లబ్ది పొందే కుట్ర కేటీఆర్.. హరీష్ చేస్తున్నారు. కేంద్రం కి.. కృష్ణా.. గోదావరి నదుల అప్పగించే పని చేసింది కేసీఆర్ గవర్నమెంట్. విభజన చట్టంలో..ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టు ల పర్యవేక్షణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి అప్పగించేలా ఉంది. పునర్విభజన చట్టం లో ప్రతీ అక్షరం నాదే అని కేసీఆర్ చెప్పారు. 2014లో విభజన చట్టం రచనకు మీరే కదా. ప్రాజెక్టు లను కేంద్రం కి అప్పగించడాని పునాది పడ్డదే మీ హయాంలో.
తెలంగాణ కి ఏదైనా అన్యాయం జరిగితే.. కేసీఆర్.. కేకే లదే బాధ్యత. ఉమ్మడి ap కి 811 టీఎంసీ నీళ్లు కేటాయింపులు జరిగాయి. 811 టీఎంసీ నీళ్ల పంపకం కోసం ఇద్దరు సీఎం లను సంప్రదించి అధికారుల తో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి సీఎం.. కేసీఆర్.. హరీష్.. 299 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకునేలా సంతకాలు చేశారు జూన్ 18, 2015 లో. 512 టీఎంసీ నీళ్లు ap కి ఇవ్వండి అని మినిట్స్ లో సంతకం చేసింది కేసీఆర్ కాదా. ఇప్పుడు 50 శాతం నీళ్లు కావాలి అని అనే వాళ్ళు అప్పుడు 299 tmc నీళ్లకే ఎందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ కి రావాల్సిన నీటి వాటా ap కి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. 2019 లో ఇంకా బరితెగించి వ్యవహారం నడిపారు. నిస్సిగ్గుగా.. ఎప్పుడూ ఒకే విదంగా నీటి వాడకం చేసుకుందాం అని బరితెగించి చెప్పింది. 27.5. 2022.. లో krmb లో ఐటమ్ 16.7 లో నాగార్జున సాగర్, శ్రీశైలం ని కేంద్రం కి హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పి వచ్చారు. ఒప్పందం పై కేసీఆర్… సంతకం చేశారు. 19.5.2023 లో జరిగిన krmb మీటింగ్ లో కూడా ఎలాంటి అభ్యన్తరం చెప్పలేదు కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ నేతృత్వంలో ఉన్న శాఖలో ఆయనే సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు లు అప్పగిస్తూ నిర్ణయం తిసుకున్నది కేసీఆర్ సర్కార్. ‘ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
