Site icon NTV Telugu

CM Revanth Reddy : కారు ఇక తుకానికి పోవాల్సిందే..

Revanth

Revanth

గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది.. కార్ఖానా నుంచి ఇక కారు వాపసు రాదన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కారు ఇక తుకానికి పోవాల్సిందేనని ఆయన అన్నారు. గద్దరన్నను అవమానించిన ఉసురు తగిలి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని, పేదల చెమట గిట్టని కేసీఆర్… బస్సు యాత్ర మొదలు పెట్టిండన్నారు రేవంత్‌ రెడ్డి. బస్సు యాత్ర కాదు.. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, సినిమా వాళ్లు చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన కేసీఆర్… సాయన్నకు మాత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదన్నారు. కంటోన్మెంట్ ప్రజలు ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోరని, కంటోన్మెంట్ ప్రజల ఓట్లు తొలగించి మీకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా..’ఎలివేటేడ్ కారిడార్ జాప్యంతో ఈ ప్రాంతం ట్రాఫిక్ జామ్ తో అతలాకుతలమైంది.. తాగు నీటి సమస్య, రోడ్ల సమస్య పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలవాలి.. ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలు పతిష్కారమవుతాయి.. శ్రీ గణేష్ ను ఎమ్మెల్యేగా, సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించండి.. మీ నాయకుడిగా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది.. ఈ ప్రాంతంలో ఆసుపత్రి లేకపోతే ఎంపీగా ఉన్నప్పుడు ఆసుపత్రి నిర్మించి మీ సమస్యను పతిష్కరించా.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తున్నాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తున్నాం.. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఎలివేటేడ్ కారిడార్ కు శంకుస్థాపన చేసుకున్నాం.. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది… కంటోన్మెంట్ లో 25వేల మెజారిటీతో శ్రీగణేష్ ను గెలిపించండి..

 

కంటోన్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి 25వేల మెజారిటీ ఇవ్వండి…సునీతమ్మకు వేసే ప్రతీ ఓటు మీ రేవంత్ అన్నకు వేసినట్టే.. ఈ ఆడబిడ్డను గెలిపించి పార్లమెంట్ కు పంపండి… కేసీఆర్ చచ్చిన పాముతో సమానం… ఇక ఆయన కథ కంచికే. బస్సు యాత్ర తరువాత ఇక ఆయనకు తీర్ధ యాత్రలే దిక్కు.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది… దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. బీజేపీ కి 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు… రిజర్వేషన్లు రద్దు చేసి.. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది..బీజేపీ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీపై ఉంది.. రిజర్వేషన్ల రద్దుపై ఈటెల రాజెందర్ వైఖరి ఏంటో చెప్పాలి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడండి.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది..’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version