CM Revanth Reddy: మీ పార్టీలో పుల్ల పెడుతుంది ఎవరో తెలుసుకో
ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళశారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 వ తేదీ సాయంత్రం సభ నిర్వహించనున్నట్లు.. సభకు తెలంగాణ జనజాతర పేరు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. జన జాతర వేదిక మీది నుండి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్..ప్రియాంక గాంధీ హాజరవుతారని, ఐదు గ్యారంటీలు వేదిక మీదనుండి ఇస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి ప్రత్యేకమని, సోనియాగాంధీ కి మరీ ప్రత్యేకమన్నారు. సోనియాగాంధీ దయ.. ప్రేమ వల్ల రాష్ట్రం ఏర్పాటు అయ్యిందన్నారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ నాయకత్వం లో వందేళ్ల విద్వాంసం చేశారని, సూపర్ సిక్స్.. ఆరు గ్యారంటీలు ఇచ్చారు సోనియాగాంధన్నారు. మిగిలి ఉన్న హామీలు ఎన్నికల తర్వాత అమలు చేస్తామన్నారు. కేసీఆర్ పొలం బాట పట్టారు సంతోషమని, పదేళ్ల తర్వాత అయినా రైతులు ఉన్నారని గుర్తు వచ్చింది ఆయనకు అంటూ సెటైర్లు వేశారు. అధికారం కోల్పోయిన దుఃఖం లో ఉన్నాడని, కూతురు జైల్లోకి పోకుంటే.. జనంలోకి వచ్చాడన్నారు. కేసీఆర్ తీరు ఆక్షేపనియమని, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి వాన కాలం ఎప్పుడు వస్తది.. ఎండ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదా అని ఆయన వ్యాఖ్యానించాఉ.
అంతేకాకుండా..’వానాకాలం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ వారసత్వం గా కరువు..అప్పులు వచ్చాయా. మీపాపాలు మాకు అంట గట్టడం ఏంది. మేము వచ్చింది ఎప్పుడు.. కరువు తెచ్చింది ఎప్పుడు. నువ్వు చేసిన పాపాలు..మాకు తగిలాయి. తండ్రుల పాపం పిల్లలకు తాకినట్టు. నీ లెక్క తప్పు అయితే.. ముక్కు నేలకు రాయాలి. కరెంట్ పోయింది అని సిగ్గులేకుండా చెస్ప్పిండు కేసీఆర్. జనరేటర్ మీద ప్రెస్ మీట్ పెట్టిండు. కరెంట్ అర నిమిషం కూడా అక్కడ పోలేదు. నీ జనరేటర్ లో పుల్ల ఎవడో పెట్టాడు. జగదీశ్ రెడ్డి పడనోడు ఎవడో చూసుకో. నీ పార్టీలో పుల్ల పెడుతుంది ఎవడో తెలుసు కో. మేము ధర్నా చేస్తే మమ్మల్ని బయకు పోనివ్వలేదు. నేనే పోలీసులకు చెప్పి అన్ని సహకారాలు చేయండి అని చెప్పిన.. నీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి.. పాపపు సొమ్ము లో 100 కోట్లు రైతులకు ఇవ్వొచ్చు కదా.. రైతుల మీద రాజకీయం చేయాలని చూస్తున్నాడు.. ప్రతిపక్ష నాయకుడివి ఇంకా బాగా తిరుగు.. తాలు పేరుతో మోసం చేస్తే తిత్తి తిస్తాం.. నేను మా ఇంట్లోనే పడుకుంటున్న.. ఆయన లెక్క ఫార్మ్ హౌస్ లో పడుకోలేదు.. కాళేశ్వరంకి మేడిగడ్ద వెన్నుపూస లాంటిది.. నీలాగే దివాళా సంసారం చేయను.. అన్నారం బొక్కే పడింది.. మేడిగడ్డ నుండి నీళ్ళు అన్నారం లోకి ఎలా విడుదల చేస్తారు.. మేడిగడ్డ మూడు నెలల ముందు కూలింది.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Almond Protest: బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి.. ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన
-
Pawan Kalyan: అధికారులతో చర్చిస్తుండగా తీవ్ర అస్వస్థత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్..
-
Couple: 29 ఏళ్ల మహిళ.. 36 ఏళ్ల ప్రియుడిని హోటల్‌కు పిలిచి.. గదిలో ఇలా..
-
AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..
-
RCB vs DC: “చిన్నస్వామిలో ‘కిల్లర్’ షో.. ఆర్సీబీ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న మిల్లర్.. బెంగళూరుకు షాక్!”
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!