Site icon NTV Telugu

CM Revanth Reddy : కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మండల వారీగా నేతలతో సమీక్ష

Revanth Reddy

Revanth Reddy

ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు రేవంత్‌ రెడ్డి.. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు, శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్‌నగర్ పరిధిలోనే ఉండటంతో.. కొడంగల్‌లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ తీసుకురావడంపై దృష్టి సారించారు. సోమవారం (ఏఫ్రిల్ 8) మండలాలవారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యుహాలపై దిశానిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఉండి పని చేయాలన్నారు. కొందరు కంకణం కట్టుకుని రేవంత్ రెడ్డిని ఓడగొట్టలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని ప్రచారం చేస్తున్నాయని.. 30 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ఓడగొట్టాలా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డ సీఎం రేవంత్.. 10 ఏళ్ళు ప్రధాన మంత్రి ఉన్న మోడీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. డీకె అరుణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి ప్రజలకు చేసిందేంది అని ఆయన అన్నారు. కొడంగల్ ఆత్మగౌరవన్ని పడగొట్టాలని చూస్తున్నారని, కొడంగల్ ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తానన్నారు. మనల్ని దెబ్బతీయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కొడంగల్ కి శుభపరిణామాలు ఉన్నాయని, కాబట్టి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి ని 50 వేల మెజార్టీ తో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారన్నారు.

Exit mobile version