Site icon NTV Telugu

Revanth Reddy: నేటి నుంచి రెండ్రోజుల పాటు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

Revanth Reddy

Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.

Read Also: MP Ranjith Reddy: నేను భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. మొత్తం ఆయనకే రాసిస్తా..

తెలంగాణ రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డికి పొరుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఇమేజ్‌ పెరిగిపోయింది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ఇటీవల వైజాగ్‌లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి హాజరుకావడంతో విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కేరళకు బయలుదేరనున్నారు. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ నుంచి కేరళకు ఆయన బయల్దేరనున్నారు. రేపు రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ పేర్కొనింది. ఈ నెల 19వ తేదీన మహబూబ్ నగర్, మహబూబాద్ ​లో జరిగే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.

Exit mobile version