Site icon NTV Telugu

CM Revanth Reddy : తిరుమల మాదిరిగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకు స్థాపన చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకు స్థాపన చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. గంధమల్లను గత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వంలో యాదాద్రిగా మార్చారని, మేం వచ్చాక మళ్లీ ప్రజలంతా పిలుచుకునే యాదగిరిగుట్టగా మార్చామన్నారు. తిరుమల మాదిరిగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.

2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

మూసీనది ప్రక్షాళన చేస్తామని ఆనాడే చెప్పామని, సబర్మతి, గంగా, యమున ప్రక్షాళన చేస్తున్నప్పుడు మూసీ ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఎర్రవల్లి, మొయినాబాద్‌, జన్వాడ ఫాంహౌస్‌లు లాక్కుంటామని మేం అనడం లేదని, గోదావరి జలాలతో మూసీ ప్రక్షాళన చేస్తామనే అంటున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో మూసీ పక్కన ఉన్నవారి ఇళ్లను కూలుస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూసీ పక్కన ఉన్నవారంతా మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లా నుంచి వచ్చినవారే అని ఆయన అన్నారు. వారికి వెయ్యి ఎకరాలు కేటాయిస్తామని చెప్పామని, 50 వేలు జేబులో లేని మందుల సామేల్‌ను 50వేల మెజార్టీతో నల్గొండ జిల్లా ప్రజలు గెలిపించారని సీఎం రేవంత్‌ అన్నారు.

NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

Exit mobile version