ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. వచ్చిన ఫిర్యాదులు వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. ప్రజా దర్బార్ కి రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాక ప్రజాభవన్ లో మంత్రి సీతక్క వినతి పత్రాలు స్వీకరించారు.
Read Also: GVL: ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదు..
ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం ప్రజాభవన్ వేదికగా జరిగిన ప్రజాదర్బార్ కు వేలాదిమంది బాధితులు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్ లో నిలబడి.. సీఎం రేవంత్ రెడ్డికి సమస్యలను చెప్పారు. అంతేకాకుండా.. వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజాదర్బార్ లో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ లోపల ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణకై క్యూలైన్ల పైన నీడను కల్పించారు. ద్వారాల వద్ద నిలుచున్న వారికి , ప్రజాదర్బార్ లోకి వచ్చిన ప్రజలకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. హైదరాబాద్ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి విజ్ఞాపనలతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ కిక్కిరిసింది.
Read Also: Onion Exports: వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం..
