NTV Telugu Site icon

CM Revanth Reddy : నేను ఎవరిపేర్లు ప్రస్తావించలేదు.. వాళ్లు ఎందుకు బాధ పడ్డారు.. రియాక్ట్‌ అయ్యారు

Cm Revanth

Cm Revanth

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందన్నారు. సునితక్క కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు అయ్యాయన్న సీఎం రేవంత్‌… కానీ అక్క ఆ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ అయ్యారని విమర్శించారు. నేను కేసుల చుట్టూ తిరుగుతున్నానని, నేను ఎవరిపేర్లు ప్రస్తావించలేదు.. వాళ్లు ఎందుకు బాధ పడ్డారు.. రియాక్ట్‌ అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మన్న అక్క.. నాకు తోడుండాలి కదా. అక్క అనే అన్నా.. వేరే భాషలో మాట్లాడలేదు అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Lavanya: మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుంది?

సభలో హరీష్ 2గంటల11 నిమిషాలు, కేటీఆర్..2 గంటల 36 నిమిషాలు, జగదీష్ 1.10 నిమిషాలు మాట్లాడారని, ఇంతకంటే ఎక్కువ మైక్ ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మా కంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడారని, రాజకీయంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దన్నారు సీఎం రేవంత్‌. సబితక్క మాట్లాడారు.. తర్వాత నేను మాట్లాడిన అని ఆయన అన్నారు. సబితక్క ఆవేదన మీద కేటీఆర్.. హరీష్ ఎందుకు అండగా లేరని అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్..హరీష్ లు మేము సరిపోతం అంటున్నారని, కేసీఆర్ నీ ఫ్లోర్ లీడర్ గా తీసేయండని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ సభ ప్రజా స్వామ్య బద్దంగా ఉందని, చర్చకు సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Adhir Ranjan: కాంగ్రెస్ అవమానిస్తే ఎన్డీయేలో చేరండి.. అధిర్ రంజన్‌కి కేంద్రమంత్రి ఆహ్వానం..

ఇవాళ రాత్రి వరకు బడ్జెట్ కి ఆమోదం కావాలని, .సభలో సస్పెన్షన్ లు ఉండొద్దు అని మా ఆలోచన అని ఆయన అన్నారు. సమయం సందర్భం పట్టి.. సభ్యుల సభ్యత్వం రద్దు కూడా ఉండొచ్చన్నారు. కోమటిరెడ్డి.. సంపత్ ల సభ్యత్వం రద్దు కాలేదా? అని ఆయన వ్యాఖ్యానించారు. నా దగ్గర 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలులు వచ్చి కలిశారు, గద్వాల ఎంఎల్ఏ వాళ్ళ దగ్గరికి వెళ్లి చాయ్ తాగి ఉంటాడు అని ఆయన అన్నారు. 2014లో.. సబితా ఇంద్రారెడ్డికి టికెట్ కూడా ఇవ్వలేదు పార్టీ అని, 2018లో సబితక్కకి టికెట్ ఇవ్వడానికి కారణం ఉత్తమ్ అన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు.