Site icon NTV Telugu

CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. శాఖల మార్పులపై కీలక చర్చలు..?

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన హైదరాబాద్‌కు బయలుదేరనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపిన ఆయన.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, కొందరు మంత్రుల శాఖల మార్పులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

Read Also: KCR Live Updates: కాసేపట్లో కాళేశ్వరం కమిషన్‌ ముందుకు కేసీఆర్.. లైవ్ అప్డేట్స్!

మంగళవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రుల శాఖల మార్పుపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియజేశారు. ముఖ్యంగా దుర్గేశ్, రమేష్, జూపల్లి తదితర మంత్రులకు కీలక శాఖలు ఇవ్వాలనే అంశంపై ఆయన పట్టుదలగా ఉన్నట్టు తెలిసింది. అయితే శాఖల మార్పుపై అధిష్ఠానం అంతగా సుముఖంగా లేకపోవడంతో తదుపరి నిర్ణయం మరింత ఆసక్తికరంగా మారింది.

Read Also: KTR: కేసీఆర్ జీవితం ఓ చ‌రిత్ర.. తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడు..!

ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బలహీన వర్గాల నుంచి వచ్చిన మంత్రులకు కూడా పెద్ద శాఖలు కేటాయించాలన్న అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేశారు. దీంతో, శాఖల మార్పులపై కాంగ్రెస్ పార్టీ విశ్లేషణాత్మకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉండగా, తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆయనతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version