CM Revanth Reddy : రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..?
- తెలంగాణ వచ్చాక కూడా పాలమూరుకు అన్యాయం జరిగింది
- గత ఐదేళ్లు పాలమూరు ప్రాజెక్టులు కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు
- గతంలో కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజల భిక్షే
- ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ దోచుకున్నారు
- పాలమూరు పేదరికాన్ని చూపించి మార్కెటింగ్ చేశారు : సీఎం రేవంత్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేడు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించిన సీఎం, అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ, ఆ కాలంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉండి ఉంటే, నేటి రోజున ఆంధ్రప్రదేశ్‌తో ఇలాంటి వివాదాలు నెలకొనేవి కావని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించామని తెలిపారు. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే, కేసీఆర్ ఓర్వలేక తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ, ఆయనే పదేళ్లు పాలమూరు ప్రాంతాన్ని ఎండబెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
Minister Kollu Ravindra: జగన్‌కు భయం.. అందుకే అసెంబ్లీకి రావడంలేదు..!
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, దీనిని పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనని స్పష్టంచేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చడం ద్వారా కేసీఆర్ పాలమూరు ప్రజలను ఏడాది పాటు గోస పెట్టారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించేందుకు కేసీఆర్ సహకరించాడని, ఆర్డీఎస్ ద్వారా అదనపు జలాలను తరలించినప్పుడు హరీష్ రావు వైఎస్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కేసీఆర్ కేవలం మౌనంగా ఉండిపోయారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ముందుగా కేటీఆర్, హరీష్ రావు, కవితల అవినీతిని తహతహలాడించాలని సీఎం రేవంత్ సూచించారు. కేటీఆర్ కార్ రేసులో అవినీతికి పాల్పడినప్పటికీ, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజా ధనం దోచుకున్నప్పటికీ, లిక్కర్ కుంభకోణంతో కవిత తెలంగాణ పరువును దిగజార్చినా, కేసీఆర్ మాత్రం వాటిపై స్పందించలేదని ఆరోపించారు. పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన పాపాలే శాపంగా మారాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణ మాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక పథకాలను అమలు చేశామని వివరించారు. ఏ గ్రామంలో అయినా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అలాగే, ఎనిమిది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసి, చారిత్రాత్మక కుల గణనను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Sambhal violence: సంభాల్ అల్లర్లపై యోగీ సర్కార్ ఉక్కుపాదం.. 3000 పేజీల చార్జిషీట్..
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..