తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బీసీలకు రీజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం.. ఇతర రాష్ట్రాల్లో వచ్చిన అడ్డంకులు తెలంగాణలో రావొద్దన్నదే మా ఆలోచన.. ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు చేసి పంపితే గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టారు.. గత సర్కార్ 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దంటూ చట్టం తెచ్చింది.. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారు..
Also Read:Telangana Assembly Sessions 2025: అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..
పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు గుదిబండగా మారాయి.. ఈ అడ్డంకిని తొలగించాలని ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ కు పంపించాం.. తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారు.. బీసీ రిజర్వేషన్లపై గంగుల ఒక్కడే సంతోషంగా ఉన్నారు.. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దుఖంతో ఉన్నారు.. బీసీ రిజర్వేషన్లపై హరీష్ రావు, కేటీఆర్ కడుపు నిండా విషం పెట్టుకుని ఉన్నారు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం.. కానీ బీఆర్ఎస్ మాత్రం మద్దతు తెలపలేదు.. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ కు లేదు..
Also Read:Balakrishna : బాలకృష్ణకు రజినీకాంత్, అమితాబ్ స్పెషల్ విషెస్
మేము సహకరించం, మా బుద్ధి మారదు అంటే.. ప్రజలే సమాధానం చెప్తారు.. మీరు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు.. ముందు మీ నాయకుడిని సభకు రమ్మనండి.. కేసీఆర్ సభకు రాడు.. వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు.. కల్వకుంట్ల కాదు.. కలవకుండా చేసే కుటుంబం.. తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారు.. ఒకిరిపై ఒకరు విమర్శలు చేసుకుని పలుచన కావొద్దు.. పొన్నంను అవమానిస్తే నీకేం రాదు.. అలా మాట్లాడితే మీరే చులకన అవుతారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
