Site icon NTV Telugu

CM Revanth Reddy: సంస్కర‌ణ‌ల‌తో దేశ ప్రగ‌తిని పీవీ పరుగులు పెట్టించారు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: సంస్కర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్రగ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్రధాన‌మంత్రి పీవీ న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాన‌మంత్రి పీవీ న‌ర‌సింహారావు జ‌యంతిని పుర‌స్కరించుకొని ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో పీవీ చిత్రప‌టానికి సీఎం రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖ‌ల మంత్రిగా, ప్రధాన‌మంత్రిగా పీవీ న‌ర‌సింహారావు చేసిన సేవ‌లు మ‌రువరానివ‌ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.ప‌ద్మావ‌తి రెడ్డి పీవీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

Read Also: Ram Mohan Naidu: కూలిన టెర్మినల్‌ కప్పు మోడీ ప్రారంభించింది కాదు.. 2009లో నిర్మించారు..

Exit mobile version