ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతాలపై .. స్పష్టంగా మాట్లాడానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని మూల సిద్ధాంతమని, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ కార్యచరణ పేరే బీజేపీ అని ఆయన అన్నారు. బీజేపీ ని అడ్డుపెట్టుకుని రిజర్వేషన్లు రద్దు చేయించాలి అనేదే అజెండా అని, దేశ స్థాయిలో చర్చ కు రావడం తో.. బీజేపీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. దాంట్లో భాగంగానే.. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ ఫిర్యాదు చేసి అక్రమ కేసు పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోడీ..అమిత్ షాలకు సూటి ప్రశ్న వేశారు సీఎం రేవంత్ రెడ్డి.. మీ పార్టీ ఆలోచన ఏంటో చెప్పండి.. అని సీఎం రేవంత్ అన్నారు. గతంలో మీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు చూడకుండా మట్లాడుతున్నారని, 2002 జస్టిస్ వెంకటా చలయ్య కమిషన్ వేశారు మీరు అని రేవంత్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా..’ ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక సీక్రెట్ గా పెట్టారు. 2024 ఎన్నికల్లో మీ సీక్రెట్ అజెండా నేను బయట పెట్టా. రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ సీఎం గా నేను దాన్ని కాపాడాలి. ఎన్నికలో నెగ్గాడానికి ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ సుల్తాన్ లు లొంగిపోతా అనుకుంటున్నారు. నాకు ఇచ్చిన హోదా.. దళిత..గిరిజన.. బీసీ లు ఇచ్చింది. వారి కోసం కొట్లాడతా.. వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు.. అప్పటి రాష్ట్రపతి Kr నారాయణ్ మాట్లాడిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చారు.. రాజ్యాంగం మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం లో భాగం గెజిట్. 2002 లో రాజ్యాంగ సవరణ పై నివేదిక ఇచ్చారు. 2004 లో బీజేపీ ని తిరస్కరించి కాంగ్రెస్ ని అధికారం లోకి రావడంతో.. రిజర్వేషన్లు ఎత్తేసే ప్రమాదం తప్పింది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత కర్త ఎన్జీ వైద్య.. 2015 లో.. రిజర్వేషన్లు అవసరం లేదని అన్నారు.. . క్యాస్ట్ పరమైన రిజెర్వేషన్ అవసరం లేదు అన్నారు. 1978 లో మండల కమిషన్ కి వ్యతిరేకంగా కమండల్ యాత్ర బీజేపీ చేసిందా లేదా..?. 1990 తర్వాత కూడా రిజెర్వేషన్ కి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో కూడా ఉద్యమాలు జరిగాయి. రాహుల్ గాంధీకి జోడో యాత్ర లో అనేక వర్గాలు రిజెర్వేషన్ పెంచాలి అని కోరారు. అందుకే జన గణన చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాం. తెలంగాణ లో కుల గణన మొదలుపెట్టాం. బీజేపీ 400 సీట్లు కావాలి అని అంటుంది.. రాజ్యాంగ సవరణకు అయ్యే బలం కావాలి కాబట్టి 400 సీట్లు అంటుంది.
ఢిల్లీ పోలీసుల ను ఎందుకు ఎంచుకున్నారు. కేంద్రం అదినం లో పోలీసులు ఉంటారు కాబట్టి ఢిల్లీ పోలీసులను ఎంచుకుంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో నన్ను అడ్డుకోవాలని బీజేపీ చూస్తుంది.. 2017 లో హెగ్డే చేసిన కామెంట్స్ రాజ్యాంగం మార్చడానికి వచ్చాం అని చెప్పారు. బీజేపీ కి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి. బీజేపీ కి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి నేను నిజం చెప్తున్నా. బలహీన వర్గాలు కి అండగా ఉండేది ఇండియా కూటమి నే. ఈ ఎన్నికల్లో రాజ్యాంగం మార్చలా..మార్చ కూడదా అనేది అజెండా. బడుగు..బలహీన వర్గాలు ఆలోచన చేసుకోండి. అమిత్ షా..మీరు పోలీసులతో బెదిరించాలని అనుకోకండి.. ఇక్కడ ఒకాయన్ని అడగండి నేను పోలీసులకు బయపడుతాడా లేడా అని.. చీకట్లో ఆయన మీతో మాట్లాడుతుంటారు కదా.. అడగండి నా గురించి.. కిషన్ రెడ్డి ఎం మాట్లాడాలో .. తెలియక అర్థం కాకుండా ఉన్నాడు.. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినట్టు..ఆధాని..అంబానీ ఉన్నారు.. మోడీ వాళ్లకు అండగా ఉంటున్నాడు.. ‘ అని సీఎం రేవంత్ అన్నారు.
