NTV Telugu Site icon

CM Revanth Reddy: రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

READ MORE: Donald Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ముగుస్తుందా? పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్

రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా ప్రయోగించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా చూడాలని కలక్టర్ లకు సూచించారు.

Show comments