NTV Telugu Site icon

CM Revanth Reddy : ఖచ్చితంగా మూసీకి డీపీఆర్‌ ఉంటుంది.. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్‌లను నియమిస్తాం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

పనే మొదలుపెట్టకముందు డీపీఆర్‌ ఉందా అంటున్నాడు కేటీఆర్‌అని, 10 వేల 800 మంది మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డీపీఆర్‌ ఉందా.? ఖచ్చితంగా మూసీకి డీపీఆర్‌ ఉంటుంది. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్‌లను నియమిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ఆర్ మనిహారంగా తీర్చిదిద్దారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఓఆర్ఆర్ లోపల నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హైడ్రాను సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. లాంగ్వేజ్, నాలెడ్జ్ వేర్వరని కేటీఆర్ తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు. అవతలి వారిని అవహేళన చేయకూడదనే అవగాహన ఆయన ఉండాలన్నారు.

Viral News: ఇదెక్కడి ఆచారం.. ముందుగా వధువు అత్తతో శృంగారం.. ఆ తర్వాతే పెళ్లి..

గత ప్రభుత్వంలో గజ్వేల్‌కు ఇచ్చిన నీరు శ్రీపాద ఎల్లంపల్లి పైప్ లైన్‌కు బొక్కపెట్టి తీసుకెళ్లినట్లు సీఎం ఆరోపించారు. దానం నాగేందర్ సభలో మాట్లాడితే తప్పేంటని, ఓ సభ్యుడికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎక్కడిదని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును ఓపికతో చూస్తున్నామని.. కోమటిరెడ్డి, సంపత్‌ని గత సభలో ఏం చేసారో మనం చూడలేదా? అని అన్నారు. ఓ అరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే గాని వారికి బుద్ధి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shivam Bhaje: శివం భజే కెరియర్ లోనే బెస్ట్ మూవీ

Show comments