NTV Telugu Site icon

Mamata Banerjee: నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా..

Mamatha

Mamatha

రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆమె కూడా సమావేశానికి హాజరుకాకుండా ఉంటారా అనే సస్పెన్స్ కు తెర తీసింది. ఈ క్రమంలో.. నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్‌ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్‌ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు.

Godavari Floods: కాళేశ్వరం వద్ద మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి

నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో కొంతసమయం ఉంటానని.. తనకు మాట్లాడేందుకు అవకాశం వస్తే.. బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై చూపిన వివక్షపై మాట్లాడుతానన్నారు. బెంగాల్‌, పొరుగు రాష్ట్రాలను విభజించేందుకు జరుగుతోన్న కుట్రపై నిరసన వ్యక్తం చేస్తానని పేర్కొన్నారు. లేదంటే.. సమావేశం నుంచి బయటకు వచ్చేస్తా అని మమతా బెనర్జీ తెలిపారు. అయితే.. మమతాబెనర్జీ నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై దీదీ మొదటి నుంచి నిరసన తెలుపుతున్నారు.

WHO: గాజాకు పోలియో ప్రమాదం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

మరోవైపు.. బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని, ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని ఇండియా కూటమిలోని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి వెళ్లమంటూ పలు రాష్ట్రాలు తెలిపాయి. అందులో.. తమిళనాడు, కేరళ, పంజాబ్‌ పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్‌, తెలంగాణ సీఎంలు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేమని చెప్పారు.