Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Mamata Banerjee Said That She Will Protest The Center In Niti Aayog Meeting

Mamata Banerjee: నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా..

Published Date :July 26, 2024 , 8:34 pm
By Rajesh Veeramalla
  • నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
  • నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా- సీఎం మమతా బెనర్జీ
  • నీతి ఆయోగ్‌ సమావేశంలో కొంతసమయం ఉంటాను- మమతా
  • తనకు మాట్లాడేందుకు అవకాశం వస్తే..
  • బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై చూపిన వివక్షపై మాట్లాడుతా- మమతా బెనర్జీ.
Mamata Banerjee: నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆమె కూడా సమావేశానికి హాజరుకాకుండా ఉంటారా అనే సస్పెన్స్ కు తెర తీసింది. ఈ క్రమంలో.. నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్‌ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్‌ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు.

Godavari Floods: కాళేశ్వరం వద్ద మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి

నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో కొంతసమయం ఉంటానని.. తనకు మాట్లాడేందుకు అవకాశం వస్తే.. బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై చూపిన వివక్షపై మాట్లాడుతానన్నారు. బెంగాల్‌, పొరుగు రాష్ట్రాలను విభజించేందుకు జరుగుతోన్న కుట్రపై నిరసన వ్యక్తం చేస్తానని పేర్కొన్నారు. లేదంటే.. సమావేశం నుంచి బయటకు వచ్చేస్తా అని మమతా బెనర్జీ తెలిపారు. అయితే.. మమతాబెనర్జీ నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై దీదీ మొదటి నుంచి నిరసన తెలుపుతున్నారు.

WHO: గాజాకు పోలియో ప్రమాదం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

మరోవైపు.. బడ్జెట్‌లో విపక్షపాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని, ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని ఇండియా కూటమిలోని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి వెళ్లమంటూ పలు రాష్ట్రాలు తెలిపాయి. అందులో.. తమిళనాడు, కేరళ, పంజాబ్‌ పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్‌, తెలంగాణ సీఎంలు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేమని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central govt
  • CM Mamata Banerjee
  • Delhi
  • niti aayog meeting
  • protest

తాజావార్తలు

  • Amaravati Capital: రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ.. పార్లమెంట్‌కు నారా లోకేష్!

  • Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి.. విలన్ అనుకుంటే షాకిచ్చారుగా..!

  • Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

  • Lungi Ngidi Ball: లుంగి ఎంగిడి అద్భుత బంతి.. నికోలస్‌ పూరన్‌ మైండ్ బ్లాక్ అయిందిగా!

  • Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions