NTV Telugu Site icon

KCR: కాసేపట్లో రాజ్‌భవన్‌కు కేసీఆర్‌.. రాజీనామా లేఖతో!

Cm Kcr

Cm Kcr

KCR: కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్‌కు వెళతారని సమాచారం. గవర్నర్ వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అయితే ఆయన స్వయంగా వెళతారా? లేక ఎవరిచేతతోనైనా తన రాజీనామా లేఖను పంపనున్నారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Read Also: Telangana Election Results: ప్రజలు మార్పు కోరుకున్నారు.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తా: కడియం

ఇదిలా ఉండగా.. ముందుగా నిర్ణయించిన మేరకు రేపు మంత్రి వర్గ సమావేశం రద్దయింది. రేపు కేబినెట్‌ భేటీ ఉన్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కేబినెట్ భేటీని రద్దు చేసుకుని ఆయన వెళుతున్నారు. ప్రగతి భవన్‌ను కూడా కేసీఆర్ వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పలు వర్గాలు తెలిపాయి.

Show comments