ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ఎన్నికలపై నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలి. లేకుంటే ఓడిపోతామని, సరిగా పని చేయని ఎమ్మెల్యేల తోక కోస్తామని హెచ్చరించారు. అయితే.. 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చిరించారు. ఆ 42 మంది ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసునని, ఇప్పుడు వారి పేర్లను బహిర్గతం చేయదలచలేదన్నారు సీఎం కేసీఆర్.
Also Read : CM KCR: వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం.. జాగ్రత్తగా పనిచేయండి
అంతేకాకుండా.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని, అంతా బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో ఆ 42 ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయమన్న సీఎం కేసీఆర్.. మీరు పనులతో సంతృప్తి పరచకపోతే చేసేదేమి లేదన్నారు. బాగా పని చేసుకుంటే మీకే మంచిదని, లేదంటే మీకే నష్టం అని పార్టీ శ్రేణులకు క్లాస్ తీసుకున్నారు. కాగా నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ తెప్పించుకున్న కేసీఆర్ అందులో 42 మందిపై వ్యతిరేకత ఉన్నట్టు.. అది కూడా వ్యక్తిగత కారణాలతోనే కొంత సమస్య ఉందని తెలియడంతో.. హెచ్చరికలు జారీ చేసినట్టు పార్టీ వర్గాల అంచనా వేస్తున్నాయి. అయితే.. కే కేశరావు ప్రసంగంతో సభ ప్రారంభమైంది. అనంతరం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీర్మానాలను ప్రవేశపెట్టారు.
Also Read : Chandrababu Naidu: కుప్పంపై చంద్రబాబు కీలక నిర్ణయం.. పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగింత..!
